నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో రూ.25 లక్షల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే పార్క్ సుందరరీకరణ, అభివృద్ధి , ప్రహరి నిర్మాణం పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని , పార్క్ అభివృద్ధి వలన ఇక్కడి చుట్టుపక్కల కాలనీ వాసులకు పిల్లలు ,పెద్దలు , వృద్ధులు వాకింగ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు పార్క్ అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని, ప్రహరి గోడ నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
రాబోయే రోజులలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని కాలనీ లలో పార్క్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు , కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.