గత ఎన్నికల్లో పది సీట్లు ఇచ్చారు..మరోసారి ఆశీర్వదించండి: మంత్రి కేటీఆర్

  • శేరిలింగంపల్లి లో మంత్రి కేటీఆర్ రోడ్ షో కు జనం నీరాజనం

నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజలను కడుపులో పెట్టుకుని కాచుకునేది కేవలం టిఆర్ఎస్ పార్టీయేనని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షో లో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, స్థానిక టిఆర్ఎస్ అభ్యర్థులుకొమిరిశెట్టి సాయిబాబా, వి.జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, నార్నె శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, దొడ్ల వెంకటేష్ గౌడ్, మాధవరం రోజా రంగారావు లతో కలిసి పాల్గొన్నారు.

రోడ్ షో లో మంత్రి కేటీఆర్ తో గచ్చిబౌలి డివిజన్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా
రోడ్ షో లో మంత్రి కేటీఆర్ తో మాదాపూర్ డివిజన్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో నియోజకవర్గంలోని పది స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చామని తెలిపారు. గత ఆరేళ్లలో టీఆరెస్ ప్రభుత్వం చేసిన పనులు చెప్పేందుకు సమయం సరిపోదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు రాష్ట్రానికి ఏమి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేసారు.

రోడ్ షో లో మంత్రి కేటీఆర్ తో హఫీజ్ పేట్ డివిజన్ అభ్యర్థి పూజిత జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ లో 4 కోట్ల మంది 2 లక్షల 72 వేల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇచ్చింది లక్ష 40 వేల కోట్ల రూపాయలేనని అన్నారు. బిజెపి నాయకులు తెలంగాణకు నిధులు ఇచ్చామంటూ అసత్య ప్రచారాలు మానుకోవాలని, బిజెపి హామీ ఇచ్చినట్టు 15 లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు బీజేపీ కి ఓటు వేయాలని ఎద్దేవా చేసారు. హైదరాబాద్ లో ఓ మతిస్థిమితం లేని నాయకుడు ఎన్ఠీఆర్ సమాధిని, పీవీ నరసింహారావు సమాధిని కూల్చేస్తా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడని, మరో నాయకుడు రాంగ్ రూట్ లో వెళ్లినా చలానాలు మేముకడతామంటూ పిచ్చి పిచ్చి హామీలు ఇస్తున్నారన్నారు.

రోడ్ షో లో మంత్రి కేటీఆర్ తో మియాపూర్ డివిజన్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్

బిజెపి గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో లో మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంటే మహిళలకు ఉచితం గా విమానం ఎక్కిస్తామంటూ నమ్మశక్యం కాని హామీలను ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ లో ఒక్క కేసీఆర్ ను ఎదుర్కోవడానికి వివిధ రాష్ట్రాల నుండి గుంపులు గుంపులు గా వస్తున్నారని, సింహం ఎప్పుడు ఒంటరిగానే బరిలో నిలుస్తుందన్నారు.

రోడ్ షో లో మంత్రి కేటీఆర్ తో చందానగర్ డివిజన్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి

ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం అంటూ మాట విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ఐదు ఓట్ల తేడా తో సెంచరీ మిస్ అయ్యిందని, ఈ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో టిఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here