వివేకానంద నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వివేకానంద నగర్ డివిజన్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి, కోడలు డాక్టర్ భార్గవి, డివిజన్ తెరాస అభ్యర్థి రోజా రంగారావుతో కలిసి విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ తిరిగి అభివృద్ధికే పట్టం కట్టాలని, కార్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆరెకపూడి పృథ్వి, ఈనాడు కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.