హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ ప్రజలు తమకు మరోసారి సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించాలని డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి పూజిత గౌడ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల తెరాస కార్పొరేటర్ అభ్యర్థులు పూజిత, జగదీశ్వర్‌గౌడ్‌లు ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు తనను మరోసారి కార్పొరేటర్‌గా గెలిపించాలని కోరారు. డిసెంబర్ 1వ తేదీన ప్రజలు వారి అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలన్నారు. హఫీజ్‌పేట డివిజన్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.