నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆశీల శివకి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సముచితమైన స్థానం కల్పిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా ఆశల శివ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందని, తనకు ఇంత మంచి పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రభుత్వం కోసం మరింత కష్టపడి పని చేస్తానని, ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.