- శేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకుల ఆత్మీయ సమ్మేళన సభ
- పాల్గొని దిశా నిర్దేశం చేసిన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్దంగా పనిచేయాలని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్స్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ స్థాయి నాయకులు, ఆపై స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ చార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు వారి వారి మండలాల్లో , డివిజన్లలో పూర్తి స్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో కలుస్తూ , మరిన్ని చేరికలతో పార్టీనీ బలోపేతం చేయాలన్నారు.
ప్రతి ఒక్కరూ వారి బూతుల్లో ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని కోరారు. బూత్ స్థాయిలో పనిచేసే నాయకులు కార్యకర్తలే తన బలం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి బూత్ లలో కార్యకర్తలు, నాయకులు రోజుకు ఒక గంట సమయం కేటాయించి దేశాభివృద్ధికి, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు వివరించి చెప్పాలన్నారు. వారి బూత్ స్థాయి నుండి కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీల నుండి చేరికలు చేపట్టాలని సూచించారు.
గత ఎన్నికల కంటే ఇప్పుడు మనకు సమయం ఉందని, ప్రతి సీనియర్ నాయకుడు ఒక్కొక్క బూత్ తీసుకుని మెజారిటీ ఓట్ల కోసం సరైన ప్రణాళికతో కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు, నల్గొండ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ బాబు, ప్రభారి శ్రీనివాస్ , రాష్ట్ర నాయకులు నరేష్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, సురభి రవీందర్ రావు , నరేందర్ రెడ్డి, రాధాకృష్ణ యాదవ్ , హనుమంత్ నాయక్ , వరలక్ష్మి, పద్మ, కో కన్వీనర్ మనిభుషన్, బుచ్చిరెడ్డి, మహిపాల్ రెడ్డి, వసంత్ యాదవ్ ,డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చ నాయకులు , బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.