- గంగారాం చెరువును సందర్శించిన ఎమ్మెల్యే
నమస్తే శేరిలింగంపల్లి : గంగారాం చెరువును యథేచ్ఛగా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, రక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు ఉదాసీనత వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారాం పెద్ద చెరువును ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో 65 వరకు అక్రమ నిర్మాణాలు గుర్తించడం జరిగిందని, మరో 10 అక్రమ భవనాల నిర్మణానికి దొడ్డిదారిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడమైనదని, ప్రస్తుతం ఒకటి నిర్మాణం దశలో ఉందని, ఇన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల జోలికి వస్తే సహించమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేందర్ బల్లా, వరలక్ష్మి, అవినాష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.