- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
- పాల్గొని జెండా ఎగురవేసిన జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్ డివిజన్ల పరిధిలోని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఆయా చోట్లా జాతీయ జెండాను మాదాపూర్ డివిజన్ నియోజకవర్గ/డివిజన్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్ర సాధించడం కోసం ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అనేకమంది జైలు జీవితం గడిపారని, బ్రిటిష్ వారు విధించే చిత్ర వేదనలను భరిస్తూ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల అందరికీ మనం కృతజ్ఞతతో ఉండాలని గుర్తుచేశారు.
మన హృదయాన్ని కదిలించే అనేక స్వాతంత్ర పోరాట సంఘటనలను భావితరాలకు అందించేందుకు వేడుకలను వినియోగించుకోవాలని తెలిపారు. స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, వార్డ్ సభ్యులు, ఏరియా సభ్యులు, బస్తి కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.