నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలు పురస్కరించుకొని కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని మాట్లాడారు. ముందుగా దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్ర పోరాట యోధులు తమ ప్రాణాలు అర్పించి మన భారతీయులందరికీ స్వేచ్ఛనందించారని, ఎలాంటి హింసకు తావు లేకుండా అహింస, శాంతి ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వారిని తరిమికొట్టామని తెలిపారు. స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన కాలనీ ప్రజలు, పెద్దలు, మహిళలు, పిల్లలు, యువజనులు, మనందరం కలిసి ఉండాలని, ప్రతి ఒక్కరు తమ దేశభక్తిని చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే. నరసింహ యాదవ్, ఉపాధ్యక్షుడు రాయుడు, కంపెనీ ప్రొప్రైటర్ మణికంఠ, రవి నాయక్, ప్రభాకర్ చారి, అన్న దొర, నరేష్ నాయక్, కే రాము యాదవ్, దశరత్ నాయక్, సురేష్ నాయక్, బాలరాజ్ సాగర్, భరత్, భేరి చంద్రశేఖర్ యాదవ్, బేరి సహస్రయాదవ్, రాజు, అశోక్, సాయి చరణ్ పైల్వాన్, శ్రీనివాస్, తేజ, కృష్ణ, కాలనీ పెద్దలు అసోసియేషన్ సభ్యులు, యువజన నాయకులు, చిన్నారులు పాల్గొన్నారు.