నమస్తే శేరిలింగంపల్లి : దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర వి.పూజిత గౌడ్ తెలిపారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో అనేక కాలనీ/బస్తీలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల అందరికీ మనం కృతజ్ఞతతో ఉండాలని గుర్తుచేశారు.
స్వాతంత్ర పోరాట సంఘటనలను భావితరాలకు అందించేందుకు వేడుకలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, డివిజన్ నాయకులు, వార్డ్ సభ్యులు, ఏరియా సభ్యులు, బస్తీ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.