ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయించండి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : ఒకటి నుంచి పంతొమ్మిదేండ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కమీషనర్, ఆరోగ్య & కుటుంబ సంక్షేమశాఖ, మిషన్ డైరెక్టర్, ఎన్ హెచ్ఎం, తెలంగాణ నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థి, విద్యార్థినులకు ఆల్బెండజోల్  టాబ్లెట్ ని వేసి మాట్లాడారు. అనంతరం ఉచిత నోట్ బుక్స్, స్కూల్ యూనిఫార్మ్స్ ను పంపిణి చేశారు.

విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

అంతకు ముందు నిర్వాహకులు కార్పొరేటర్ కి ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమమని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని నియంత్రించడానికి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే తాగడం, ఆహారంపై మూత ఉంచుట, పండ్లను, కాయగూరలను శుభ్రమైన నీటితో కడగడం తదితర సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జెడ్పి హెచ్ఎస్   ఇంచార్జి హెచ్ఎం  భాస్కర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందర్, సిహెచ్ఓ  చిలివేరి స్వామి, హెచ్ఈ   బలరాం, సబ్ యూనిటీ ఆఫీసర్ శ్రీనివాస్, జెడ్పి హెచ్ఎస్ ఉపాధ్యాయులు బల్వంత్ రెడ్డి, శివ కుమార్, కరుణ, గోపాల్, చంద్ర ప్రకాష్ రెడ్డి, బలరాం, మహేందర్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఆశ వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here