- బెంగళూరులో కొనుగోలు
- ట్రావెల్స్ బస్సులలో భాగ్యనగరంలో సరఫరా
- 50 మంది వరకూ వ్యాపారవేత్తలు ఉన్నట్లు సమాచారం.
- డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పాత నేరస్థుడు సాయి చరణ్ ను పట్టుకున్న నార్కోటిక్స్ పోలీసులు
- సాయి చరణ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఐదుగురు వ్యాపారవేత్తలు అరెస్ట్
- ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం
నమస్తే శేరిలింగంపల్లి : పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ ముఠాలు మాత్రం తమపని తాము చేసుకుపోతున్నాయి. డ్రగ్స్ సరఫరాదారులు అనునిత్యం ఎక్కడోచోట సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా మాదాపూర్ లో ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని నార్కొటిక్స్ పోలీసులు పట్టుకున్నారు. సాయిచరణ్ అనే పాత నేరస్థుడు బెంగళూరు నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి రాజేశ్వరి ట్రావెల్స్, జీవీఆర్ ట్రావెల్స్, స్టార్ట్ ట్రావెల్స్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ లలో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్ సరఫరా చేస్తున్నాడు.
అతడి కస్టమర్లలో నగరానికి చెందిన సుమారు 50 మంది వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తుంది. పక్కా సమాచారంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొస్తున్న సాయి చరణ్ ని శనివారం నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో డ్రగ్స్ ను కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ట్రావెల్స్ బస్సుల డ్రైవర్స్ కు ఇస్తున్న సాయి చరణ్ వాటిని కోడ్ బాష ద్వారా తన కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు. తాజాగా సాయి చరణ్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వ్యాపారవేత్తలు మాలిక్, లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం అనే నలుగురు వ్యాపారవేత్తలతో పాటు సాయిచరణ్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు. గతంలోనూ సాయిచరణ్ ను డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.