నమస్తే శేరిలింగంపల్లి : జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గాంధీ భవన్ నుండి బషీర్‌బాగ్ చౌరస్తా వరకు నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలని ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి కొమరగౌని సురేష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ బొల్లంపల్లి నవీన్ రెడ్డి, సిద్ధార్థ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.