సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం యోగా

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని శారదా హైస్కూల్ వద్ద ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు వి. రామారావు విద్యార్థిని, విద్యార్థులతో యోగాసనాలు చేయించారు.

విద్యార్ధిని, విద్యార్థులతో యోగాసనాలు వేయిస్తున్న యోగా గురువు వి. రామారావు

అనంతరం కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, గురువు  రామారావు మాట్లాడుతూ “మన సనాతన సంపూర్ణ జీవన శాస్త్రమైన యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తం చేసేందుకు ఐక్యరాజ్యసమితి గత పదేండ్ల నుంచి ప్రతి ఏటా ఒక నినాదంతో జూన్ 21వ తేదీన యోగా దినోత్వాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ‘మహిళల సాధికారత కోసం యోగా” అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగ వల్ల శారీరక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికతలు పెంపొందుతాయన్నారు. ఈ సందర్భంగా యోగా గురువులను పుష్పగుచ్ఛం, శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు బందా నరేంద్రబాబు, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, పాలం శ్రీను, ధర్మసాగర్, బాలరాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here