- అవకతవకలు లేకుండా మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలి : ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కమిటీ
నమస్తే శేరిలింగంపల్లి : జూన్ 4 మంగళవారం విడుదలైన నీట్ యూజీ 2024 ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు పెద్దారపు రమేష్ అన్నారు. ఈ మేరకు మియాపూర్ ఎంఏ ఆఫీసులో ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అధ్యక్షతన అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్రకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడారు. 67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఎ)ప్రకటించింది. దీనిలో 8 మంది విద్యార్థులు ఒకే సెంటర్ కు చెందిన వాళ్లు ఉండడం గమనార్హం.
అదేవిధంగా పరీక్షలో కొంతమంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్ పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, అదేవిధంగా తప్పుడు సమాధానికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 720 పూర్తి మార్కులు సాధించిన విద్యార్థులు 68 మంది ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే ర్యాంకుల విద్యార్థులు వారి పూర్తి స్కోరు ఒక ప్రశ్నకు సమాధానం అసలే ఇవ్వకపోతే 716 మార్కులు సాధించి ఉండాలి. లేదా ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇస్తే 715 మార్కులు వచ్చి ఉండాలి. కానీ తర్వాతి ర్యాంకులలో వచ్చిన విద్యార్థులు 719, 718 మార్కులు సాధించారని ఎన్.టి.ఎ ప్రకటించిన ఫలితాలల్లో వెళ్లడవుతుంది. అంటే మార్కుల ప్రకటనలో ఎన్.టి.ఎ డొల్లతనాన్ని తెలియజేస్తుందన్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో సమయం కోల్పోయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులను కలిపిస్తామని, అందుకే 719, 718 మార్కులు కూడా రావచ్చని ఎన్.టి.ఎ ప్రకటించింది. కానీ దేని ఆధారంగా, ఏ మెథడ్స్ ను ఉపయోగించి గ్రేస్ మార్కులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు నేడు ఒకే సెంటర్ నుండి 68 మంది టాపర్లు ఎందుకు ఉన్నారు. పాట్నా, గుజరాత్ ఇంకా అనేక ప్రాంతాల్లో పేపర్ లీక్ అయిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారు. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద పరీక్ష స్కామ్ గా మారిందని, ఈ స్కామ్ వల్ల డాక్టర్ చదువుదామనే లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంద ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వస్తున్న విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని పరీక్షను వెంటనే రద్దుచేసి తిరిగి నిర్వహించాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేనిపక్షంలో నూతనంగా ఎన్నికైన బిజెపి ఎం.పి, కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, ఏఐఎఫ్డి ఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర కమిటీ సభ్యులు జన్ను రమేష్, టెంకటి కుమార్, మార్త నాగరాజ్ పాల్గొన్నారు.