- శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజనలో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్/మియాపూర్/మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తి అభివృద్ధికి కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ తో కలిసి అభివృద్ధికి పనులపై జీహెచ్ఎంసి ఇంజినీరింగ్ ఈఈ, డీఈ, ఇతర అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడారు.