- సేలంపల్లి సర్కిల్లో జెడ్సీ ఉపేందర్ రెడ్డి పర్యటన
- అధికారులకు ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని సేలంపల్లి సర్కిల్లో జెడ్సీ ఉపేందర్ రెడ్డి సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ నుంచి మల్కం చెరువు వరకు రెండున్నర కిలోమీటర్లు కాలినడకన వెళ్తూ ఫుట్ పాత్, రహదారులు, పారిశుధ్య పనులను పరిశీలించారు. కేశవ్ నగర్, ఆదర్శ్ నగర్లలో పరిశుభ్రత చర్యలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జెడ్సీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రహదారులను అత్యంత పరిశుభ్రంగా నిర్వహించాలని, ఫుట్ పాత్ లు శుభ్రంగా ఉండాలని, చెత్త, ఇతర వ్యర్ధాలు రహదారులపై కనపడ వద్దని సిబ్బందిని ఆదేశించారు. పాదచారులు రోడ్డు దాటేందుకు అనువైన జీబ్రా క్రాసింగులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఐటీకి కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లి జోన్ పరిశుభ్రతలో ముందు వరుసలో ఉండేలా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఆయన వెంట వైద్యాధికారి డాక్టర్ నగేష్, ఎస్ఆర్పిలు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.