కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి

  • గులషన్ నగర్ కాలనీ, వడ్డర బస్తీలలో కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటన.. అధికారులకు ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి గులషన్ నగర్ కాలనీ, వడ్డర బస్తీలలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానిక నాయకులతో కలసి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు తెలుసుకొని, సంబంధిత జీహెచ్ఏంసీ, హెచ్ఏండబ్ల్యూ, ఎలక్ట్రికల్ అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్థానికంగా నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ హమీద్ పటేల్ వివరిస్తున్న స్థానికులు

నూతనంగా వేసిన డ్రైనేజీ వేసిన తర్వాత మిగిలిన మట్టిని వెంటనే ఎత్తివెయ్యాలని అధికారులకు సూచించారు. కొన్నిచోట్ల వెలగకుండా ఉన్న స్ట్రీట్ లైట్లను వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. కిందకు వేలాడుతున్న ఎలక్ట్రికల్ కేబుల్ వైర్లను క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు.

స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న హమీద్ పటేల్

రోడ్లు వేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను చేయాలని అధికారులకు సూచించారు. కార్పొరేటర్ వెంట అబ్దుల్ కరీం, గొలుసుల రాము, వాలి ఉద్దీన్, కమర్ ఉద్దీన్, రహమతుల్లా, భద్ర, రియాజ్ ఉద్దీన్, సయ్యద్ అయాజ్, ఇమ్రోజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here