కనులపండువగా శ్రీ జగన్నాథ రథయాత్ర.. పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీలో శ్రీ రామాలయం నుంచి నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు.

జగన్నాత రథయాత్రలో స్వామి వారికి పూజలు చేస్తున్న భేరి రాంచందర్ యాదవ్, తదితరులు

ఈ జగన్నాథుని రథయాత్రలో వివిధ దేవుళ్ళ వేషధారణలో చిన్నారులు అలరించారు. దేవుడి ఆట, పాటలతో భక్తులు మైమరపించారు. సంస్కృతికి సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ఈ రథయాత్ర వేడుకలు జరిగాయని భేరీ రాంచందర్ యాదవ్ తెలిపారు. ఆ జగన్నాధుని చూడ రెండు కళ్ళు చాలవన్నారు. వేడుకల్లో నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, పెద్దరాజుల మధు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here