నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ జమదగ్ని మహాముని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు వాల హరీష్ రావు, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, మనోహర్ గౌడ్, వేణు, తిరుమలేష్, భక్తులు పాల్గొన్నారు.