అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడా లోని సర్వే నెంబర్ 149లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జీఓ నెంబర్ 59ను దుర్వినియోగం చేస్తూ రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వ స్థలాన్ని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.

జీఓ నెంబర్ 59ను దుర్వినియోగం చేస్తూ రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వ స్థలం వద్ద ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడా లోని సర్వే నెంబర్ 149లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జీఓ నెంబర్ 59ను దుర్వినియోగం చేస్తూ ఒక్కోరికి వేలాది గజాల స్థలాన్ని రాసిచ్చేశారని, జీఓ 59ను దుర్వినియోగం చేసిన అధికారులు , కాంగ్రెస్ నాయకుడు ప్రధాన సూత్రధారి పి. సురేందర్ అతని కుటుంబ సభ్యులు బినామిల పేర్ల మీదుగా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నాడని , చేసుకున్న కొన్ని గంటలలోనే కొన్ని నిర్మాణము సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు
లో ఉండగా ఈ తతంగం అంతా నడిపించారని , డాక్యుమెంట్లను ,అన్ని ఆధారాలను చూపిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో కాదని,, ఇటీవలే జరిగిందని ఆధారాలు చూపిస్తున్న ఎమ్మెల్యే

అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా 59 G.O కు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేసిన స్థలాన్ని వెంటనే రద్దు చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న కోట్లాది రూపాయల వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాలు చేసి జీఓ 59 కింద రెగ్యులరైజ్ చేశారని, కనీసం స్థల పరిశీలన కూడా లేకుండానే రెవెన్యూ అధికారులు కన్వినియెన్స్ డీడ్ చేశారని అన్నారు. జీఓ 59 నిబంధనలు తుంగలో తొక్కి రాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరిపై వేల గజాల స్థలం రెగ్యులరైజ్ చేశారని, డీడ్ చేసుకున్న వ్యక్తి అదే రోజు రాత్రికి రాత్రే అమ్మేసుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల స్థలం చేతులు మారడంలో అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధుల పాత్ర ఉందని ఎమ్మెల్యే గాంధీ విమర్శించారు. కొందరు కావాలనే గత ప్రభుత్వ హయాంలో జరిగింది అంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా జరిగింది డిసెంబర్ 5న రాత్రి సమయంలో జరిగిందని ఆధారాలు బహిర్గతం చేశారు. ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతాన్ని వెంటనే అరికట్టాలని, జీఓ 59ను దుర్వినియోగం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, అక్రమార్కుల పై , కఠిన చర్యలు తీసుకోవాలని , గాంధీ డిమాండ్ చేశారు. జీఓ దుర్వినియోగం చేసిన అధికారులు, వ్యక్తులపై చర్యలు తీసుకునేంత వరకు పోరాడతామని ఎమ్మెల్యే గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here