నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థులు కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకు, తమతమ ప్రాంతానికి, రాష్ట్రానికి , దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని ఎమ్మెల్యే గాంధీ అభిలాషించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరకాలనీ కి చెందిన భాస్కర్ రావు, మాధవి లత కుమార్తె సాయి సుదీక్ష జేఎన్టీయూ యూనివర్సిటీ లో బీటెక్ (ఇంజనీరింగ్) లో ఉత్తమ శ్రేణి మార్కులతో పాసై, అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ శుభసందర్బంగా విద్యార్థినిని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శాలువతో సత్కరించి అభినదించారు.
అనంతరం మాట్లాడుతూ సుదీక్ష ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాదించడం గొప్ప విషయం అని ,ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందనలు తెలిపారు. చదువుకి పేదరికం అడ్డుకాదని, ఉన్నతమైన లక్ష్యం ఏర్పచుకొని మరిన్ని విజయాలను స్వంతం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వేశర కాలనీ వాసులు రాజశేఖర్, సౌజన్య, సుదీక్ష తల్లిదండ్రులు భాస్కర్ రావు, మాధవి లత పాల్గొన్నారు.