నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో వనమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప కమిషనర్ వంశీ కృష్ణ , శేరిలింగంపల్లి జోన్ యుబిడి డైరెక్టర్ అనిల్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషకరమైన విషయం అని, ప్రతి కాలనీలో వనమహోత్సవం హరిత వైభవోత్సవంగా విరాజిల్లునని, కాలనీలు పచ్చని మణిహారంగా మారునుందని, కాలనీలో ప్రధాన రహదారికిరువైపులా అంతర్గత రోడ్లలో మొక్కలు నాటామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని మణిహారంగా మార్చారని తెలిపారు. అటవీ శాతాన్ని పెంచాలన్న సదుద్దేశంతో తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నదన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు యూబీడీ మేనేజర్లు సమీరా, విక్రమ్ చంద్ర, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, గోపి, ఓ.వెంకటేష్, అక్బర్ ఖాన్ గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి , నరేందర్ బల్లా, యూసఫ్, హుసేన్, ఎల్లమయ్య, రాహుల్, సందీప్, దీక్షిత్, అవనాష్, ఉదయ్, వెంకటేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు.