నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్య సంకీర్తనల ప్రచారంలో భాగంగా పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్మమ స్వరార్చన అలరించింది. ఈ స్వరార్చనకు శ్రీరామా కర్ణాటక సంగీత పాఠశాల నుండి గురువు జొన్నలగడ్డ మాధురి” వారి శిష్యులు జే. కేశవ హరిచరన్, స్వేచ్ఛ రెడ్డి, వైష్ణవి, వందిత్య, ప్రతీఖ్య, తరుణ్ బాలాజీ, శ్రీకృతి, లితిక, శరణ్య, లలిత సౌజన్య” సంయుక్తంగా “శ్రీ గణేశ కృతి, మాధవ కేశవ, గోవింద గోవింద, ఎండగాని నీడగాని, శరణు శరణు, తిరుమల గిరి రాయ, ఆరగించి కూర్చున్న, ఇందరికి అభయంబు, తందనానా అహి, ఇట్టి ముద్దులాడి, అన్ని మంత్రములు, చూడరమ్మ సతులాల” అనే ప్రఖ్యాత సంకీర్తనలకు స్వర సేవను స్వామికి అందించారు.
కీబోర్డు మారుతి కిరణ్, తబలా శ్రీనివాస్ వాయిద్య సహకారాన్ని అందజేశారు. తదనంతరం సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు కళాకారులని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.