- బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘన సన్మానం
నమస్తే శేరిలింగంపల్లి: ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడు ప్రధానోపాధ్యాయుడు అనంతరెడ్డి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. లింగంపల్లి డివిజన్, మసీదు బండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులను ఉత్తిర్ణులుగా తీర్చిదిద్ది , పాఠశాల అభివృద్ధి కోసం ఎనలేని సేవలందించి, బదిలీపై వేరే పాఠశాలకు వెళ్తున్న ప్రధానోపాధ్యాయుడు అనంత రెడ్డిని ఘనంగా సన్మానించారు.
అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన ప్రధానోపాధ్యాయులు అనంత రెడ్డిలా పనిచేయాలని సూచించారు.