- రామకృష్ణ నగర్ వద్ద సమీక్ష సమావేశంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ముఖ్యంగా హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో ఇప్పటికే 90శాతం పనులు పూర్తి చేసామని, ఎన్నికలు పూర్తయిన వెంటనే పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ నందు కాలనీ వాసులు ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సురేందర్, వీరభద్ర రావు, వెంకటయ్య, ప్రభాకర్ రావు, బాలక్రిష్ణ, వంశీకృష్ణ, రంగారావు, కుమార్, సుబ్రహ్మణ్యం, సాయి యాదవ్, శ్రీనివాసరావు, వెంకటేశ్వర రెడ్డి, కృష్ణ, సత్యనారాయణ, విజయ్, శ్రీనివాస్, అమరేందర్ రెడ్డి, అజయ్, శశిధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రసాద్ రావు, మల్లికార్జున్, రామకృష్ణ, మహేందర్, మురళి, వాసు, మహిళలు శిరీష, పార్వతి, లక్ష్మీ, రాధిక, వరలక్ష్మి, శోభ పాల్గొన్నారు.