నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి లోని భారతి నగర్ డివిజన్, ఓల్డ్ ఎంఐజీ లో మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్శంగా ఏర్పాటు చేసిన వేడుకలలో హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు పెద్ద పీట వేస్తూ మహాలక్ష్మి, గృహలక్ష్మి వంటి పథకాలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపే అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులను లక్షాధికారులను చేయడమే లక్షంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడం శుభసూచికం అని తెలిపారు.