నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ చందానగర్ డివిజన్ పరిధిలోని పలు గణేష్ మండపాలలో వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆయా వినాయక మండపాల్లోని గణనాథులను దర్శించుకున్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడు సకల శుభాలను ఇస్తూ అన్ని అడ్డంకులను తొలగించేవాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ గౌడ్, కాకర్ల అరుణ పాల్గొన్నారు.