- పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి పెరుగుతున్న ఆదరణకు బెంబేలెత్తిపోతున్న అధికార పార్టీ శాసనసభ్యులు తాము బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామని మర్చిపోయి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సమావేశంలో మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాల్చి చంపేస్తానని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.
స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల రక్షణ, రెచ్చగొట్టే ధోరణిలో అధికార అహంకారంతో మాట్లాడిన నాగర్ కర్నూల్ శానసభ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సౌదర్య రాజన్ చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ప్రధాన కార్యదర్శి దుర్గేష్, 106 శేరిలింగంపల్లి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ శామ్యూల్ కార్తీక్, దొంతి శివ, హఫీజ్ పేట్ డివిజన్ దుర్గాదాస్, సూర్య, అశోక్ పాల్గొన్నారు.