- గడపగడపకు బిజెపి రవన్న ప్రజాయాత్రలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న భవానీపురం కాలనీలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్ట లేదంటే ఈ కాలనీ పై ఉన్న ప్రేమ స్థానిక ఎమ్మెల్యే తేల్చి చెప్పాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ భవానిపురంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పనితీరు చూస్తే ఉన్నవారికి ఒక విధంగా లేనివారికి ఒక విధంగా పనులు చేసి పెడుతూ స్థానిక, స్థానికేతర విభజించి పాలించు అనే విధంగా కొన్ని కాలనీలకే ప్రాతినిధ్యం ఇస్తూ మిగతా కాలనీలను పట్టించుకోవడం లేదని తెలిపారు.
రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే దశలవారీగా కాలనీలను బస్తీలను అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి నవత రెడ్డి, లక్ష్మి కాంత్ రెడ్డి, చందర్ యాదవ్, రంగయ్య, అనంతరెడ్డి, మల్లేష్ గౌడ్, కృష్ణ దాస్ పాల్గొన్నారు.