- లోతట్టు, ముంపు ప్రాంతాలలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటన
నమస్తే శేరిలింగంపల్లి: గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించి, పరిశీలించారు. ఇందులో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ నాలాను పరిశీలించి మాట్లాడారు. అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, పనులు సకాలంలో పూర్తి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు చెప్పారు. ప్రజలు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని సూచించారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హాఫిజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు.