ప్ర‌భుత్వ ఆసుప్ర‌తుల‌లో మెరుగైన వైద్య‌స‌దుపాయాలు క‌ల్పించాలి: ర‌వికుమార్‌యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మెరుగైన వైద్య స‌దుపాయాలు క‌ల్పించాల‌ని శేరిలింగంప‌ల్లి బిజెపి నాయ‌కులు ఎం.ర‌వికుమార్‌యాద‌వ్ అన్నారు. శుక్ర‌వారం శేరిలింగంపల్లి డివిజ‌న్ బిజెపి కార్పొరేట‌ర్ కంటెస్టెడ్ అభ్య‌ర్థి ఎల్లేష్ ఆధ్వ‌ర్యంలో ర‌వికుమార్‌యాద‌వ్ లింగంప‌ల్లి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా వైద్య ప‌రీక్ష‌లు, ఇత‌ర స‌దుపాయాల‌పై ఆసుప‌త్రి సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆసుప‌త్రిలో వ్యాక్సిన్, సిబ్బంది కొరత కార‌ణంగా కరోనా టెస్టులు చేయడానికి చాలా సమయం పడుతుందని, వ్యాక్సినేష‌న్ కు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. ప్రభుత్వ ఆసుప‌త్రుల‌లో సిబ్బంది కొర‌త లేకుండా చూడాల‌ని, క‌రోనా టెస్టుల‌ను అధికంగా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంప‌ల్లి బిజెపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

లింగంప‌ల్లి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో వైద్య స‌దుపాయాల‌ను ప‌రిశీలిస్తున్న ర‌వికుమార్ యాద‌వ్‌
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here