నమస్తే శేరిలింగంపల్లి: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి డా.రవికుమార్ నాయక్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్‌గౌడ్ అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హలియా మండలం పరిధిలోని చెల్మరెడ్డి గూడెం, కొట్టాల గ్రామాలలో బీజేపీ జాతీయ ఉపాదక్ష్యురాలు డి.కే అరుణ తో కలిసి ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌గౌడ్ మాట్లాడుతూ హాలియా మండలంలో ప్రజలంతా స్వచ్ఛందంగా బిజెపికి మద్దతు తెలిపేందుకు ముందుకు వస్తున్నారని, టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత కనబరుస్తున్నారని తెలిపారు. ఎన్నికలో రవికుమార్ నాయక్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓ.బీ.సి మోర్చ ఉపాదక్ష్యులు మక్తల స్వామి గౌడ్, నల్గొండ జిల్లా కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, శేరిలింగంపల్లి 106 డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కుర్మ, గోవర్ధన్, కరుణాకర్, ప్రశాంత్, నాయుడు, వెంకయ్యలతో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.