మహిళా సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వ కాంగ్రెస్

  • వికారాబాద్ జిల్లా చైర్మన్ పట్నం సునీత మహీందర్ రెడ్డి
  • అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీలో వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి : మహిళల అభ్యున్నతికి చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని వికారాబాద్ జిల్లా చైర్మన్ పట్నం సునీత మహీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు, మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకల్లో ఆమెతోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.

పీజేఆర్ నగర్ బస్తీలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో మాట్లాడుతున్న వికారాబాద్ జిల్లా చైర్మన్ పట్నం సునీత మహీందర్ రెడ్డి

ముందుగా బాబు జగ్జీవన్, డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళ సోదరీమణులందరికి, ప్రపంచ మహిళ సోదరిమనులందరికి అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో మహిళ దినోత్సవ సంబురాలను అంబరాలు తాకేలా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళామణులు

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జేరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, మనెపల్లి సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, ఇలియస్ షరీఫ్, సురేష్ నాయక్, ఏకాంత్ గౌడ్, ఇస్మాయిల్, బాష్పక యాదగిరి, భారత్, బసంత్ రాజ్, కరుణాకర్ రెడ్డి, రాజన్, శ్రీహరి, బాసిపక యాదగిరి, సురేశ్ నాయక్, శశి, రవి, వాసు, సంగమేష్, శ్రీనివాస్ బాబు, సయ్యద్, నాయక్, రెహ్మాన్, రాజా, రూబీన్, బాలు, చంద్రన్న, శ్రీను, అత్తరసింగ్, ప్రలీత్, సయీద్, రవి, రఫిక్, మాజర్, మౌలానా, శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా మహిళ అధ్యక్షురాలు జయమ్మ, మహిళ నాయకురాలు మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, నాగమణి, కల్పన, శిరీష సతూర్, శ్రీదేవి, వసంత, మనెమ్మ, శ్రీలక్ష్మీ, మౌనిక, లీల, విజయపద్మావతి, శాంత, పార్వతి, రాణి, విజయమ్మ, మనెమ్మ, భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ కమిటీల నాయకులు, అనుబంధ కమిటీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

#WomensDayCelebration #Serilingampally #incharge #jagadeeshwargoud #CongressParty #patnamsunithamahinderreddy #congressfullfills #revanthreddyanumula #JaiCongress

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here