నమస్తే శేరిలింగంపల్లి: త్యాగాలకు ప్రతీక మొహర్రం పండుగ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ సిద్ధిక్ నగర్ సయ్యద్ ఇజ్మైల్ షా క్యధరై దర్గా పీర్లను దర్శించుకుని అనంతరం మాట్లాడారు.
మొహర్రం స్ఫూర్తిగా మనమంతా మానవతావాదానికి పునరంకితమవుదామని అన్నారు. త్యాగాలకు ప్రతీకగా సాగే ’పీర్ల‘ ఊరేగింపును ముస్లింలతో పాటు హిందువులూ కలిసి జరపుకుంటున్న పీర్ల పండుగ మతాలకతీతంగా హిందూ ముస్లింల సఖ్యతను, ఐక్యతను గంగా జమునా తెహజీబ్ ’ ను మొహర్రం చాటి చెప్తుంది అని అన్నారు. హిందూ ముస్లిం ఐక్యత కొన్ని ప్రాంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడా పీర్ల పండగను పెద్ద పండుగగా భావిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జమీల్ బాయ్, పజిల్ బాయ్, మహమ్మద్ బాయ్, లడ్డు, అయ్యప్ప, సాయిబాబా, కిరణ్, జహీర్, బాబర్, ఫరూక్, అమర్, సాయికుమార్, జాన్ తదితరులు పాల్గొన్నారు.