శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబోలి డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన Hindware & BOSCH షోరూమ్ ను సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజ్, విజేత సూపర్ మార్కెట్స్ MD జగన్మోహన్ రావుతో కలసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ స్థానికులకు నాణ్యమైన హోమ్ అప్లయెన్సెస్, శానిటరీ ఉత్పత్తులు అందుబాటులోకి రావడం అభివృద్ధికి సూచిక అని అన్నారు. కస్టమర్లకు నమ్మకంగా అనుగుణంగా మంచి సేవలను అందజేస్తూ వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో Hindware & BOSCH షోరూమ్ నిర్వాహకులు సందీప్ , రామకృష్ణ, నాయకులు వెంకటేశ్వర రావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.






