శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే లు , ఎంపీ లపై దాడులు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్ రావు అక్రమ అరెస్టులను తీవ్రంగా నిరసిస్తూ శేరిలింగంపల్లి అసెంబ్లీ , చందానగర్ గాంధీ విగ్రహం నుండి జీహెచ్ఎంసీ మియాపూర్ సర్కిల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వరకు భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోపుకొండ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తోపుకొండ మహిపాల్ రెడ్డి , బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ,TAC మెంబర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాలు కాషాయ ప్రభంజనాన్ని ఆపలేవని అన్నారు. అధికార అహంకారానికి, ప్రభుత్వ బెదిరింపులకు భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తే లేదని, తెలంగాణ సమాజం కోసం, ప్రజల హక్కుల కోసం బిజెపి నాయకులు, కార్యకర్తలు చేస్తున్న అలుపెరగని పోరాటం ఇదని, ధర్మం గెలిచే వరకు ఈ పోరు ఆగదని అన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాచమళ్ళ నాగేశ్వర్ గౌడ్ , బీజేపీ జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్ , బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజిత్ సేనాపతి , చందానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ , మియాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ , మాదాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి , బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి విజేందర్ , బీజేవైఎం నాయకులు రాజు శెట్టి , విష్ణు , బీజేపీ మహిళా నాయకురాలు పద్మ , పార్వతీ , శోభా , బీజేపీ నాయకులు వనమా శ్రీనివాస్, అమరేందర్ , రత్నకుమార్ , రాములు , ప్రశాంత్ చారి , రాజు , బీజేవైఎం నాయకులు రాము యాదవ్ , లోకేష్ , విజయ్ , స్వామి పాల్గొన్నారు.





