నమస్తే శేరిలింగంపల్లి: అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో శనివారం జరిగిన అన్నమ స్వరార్చన అలరించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి సిద్ధార్థ్ “బోయ జయలక్ష్మి”, “తిరుమల గిరిరాయ”, “చక్కని తల్లికి”, “రామచంద్రుడితడు”, “ఇట్టి ముద్దు”, “శరణు శరణు” అంటూ అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. శ్రీనివాసాచార్యులు వయలిన్, కౌండిన్య మృదంగం, వాయిద్య సహకారం అందించారు.
అనంతరం అన్నమ స్వరార్చన చేసిన సిద్ధార్థ్ బోయను శోభా రాజు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు. అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.