సిఐఐ, ఐజిబీఎస్ కి పూర్తి సహకారం అందిస్తాం : మంత్రి కేటిఆర్

  • ఐజిబిఎస్ గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన కేటిఆర్

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ  షోను మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.

మంత్రి తో పాటు శాసన మండలి చీఫ్ విప్ బాను ప్రసాద్, ఎమ్మెల్యే సైది రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి గ్రీన్‌ బిల్డింగ్‌, గ్రీన్‌హోమ్‌, గ్రీన్‌ ఎయిర్‌పోర్టు లాంటివి తెలంగాణలో ఉండటం గర్వకారణమని అన్నారు. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక హరితహారంతో తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సిఐఐ- ఐజిబిసి కి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజిబిఎస్) సంయుక్త భాగస్వామ్యంతో జులై 28 నుండి 30 వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఐజిబిఎస్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 70 కి పైగా గుర్తింపు పొందిన ఐజిబిఎస్ సర్టిఫైడ్ హోమ్స్ , బిల్డింగ్స్ , ప్రాపర్టిస్, పర్యావరణ హిత నిర్మాణం సామాగ్రికి సంబందించిన 50 కి పైగా గ్రీన్ ప్రాడక్ట్స్ ఈ ప్రదర్శన లో పాల్గొన్నట్లు చెప్పారు. హైదరాబాద్ మహా నగరం హరిత భవనాలకు అధిక ప్రాధాన్యత నిస్తూ పర్యావరణ పరంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కల బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇది పునాది అన్నారు. కార్యక్రమంలో బిల్డర్లు, కొనుగోలు దారులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here