శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జల వాయు విహార్ కాలనీ రోడ్ నెంబర్ 1, 2 లో రూ.20 లక్షల అంచనా వ్యయంతో మొదలవుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, కాలనీ వాసులతో కలసి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా డిపార్ట్మెంట్ కి సహకరించాలని కోరారు. పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






