మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ప్రజల సంక్షేమమే తప్ప స్వార్ధ ప్రయోజనాలు లేని ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని ఆ పార్టీ మియాపూర్ డివిజన్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారం లో భాగంగా డివిజన్ పరిధిలోని చిరంజీవి నగర్, వీడియా కాలనీ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజక వర్గం లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన టిఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. కేటీఆర్ రోడ్ షో కు వచ్చిన స్పందన చూస్తుంటే టీఆరెస్ గ్రేటర్లో తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధిస్తుందనే ఆత్మస్థైర్యాన్ని తమలో నింపిందన్నారు. ప్రభుత్వం కేవలం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుందని తెలిపారు.

ప్రభుత్వం చెపాన్ని అభివృద్ధి పనులు నగర రూపురేకలు మార్చివేశాయని, సంక్షేమ పథకాలు పేదవారి జీవితాల్లో వెలుగులు నింపాయని తెలిపారు. ప్రజలంతా జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆరెస్ పార్టీకి ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాశిలి చంద్ర శేఖర్ ప్రసాద్, మహేందర్ ముదిరాజ్, మాధవరం గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
