గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల్లో గచ్చిబౌలి డివిజన్ నుండి తమను గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి భరత్ సతీమణి పూర్ణిమ భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం భరత్ కుమార్ కు మద్దతుగా నానక్ రామ్ గూడలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానికులను కలిసి కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా, పాలకులు మారుతున్నా డివిజన్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఎన్నో కాలనీలలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒక్కసారి తమకు అవకాశమిస్తే డివిజన్ లో సమస్యలో పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
