- ఘనంగా పద్మశాలి సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకార, నూతన 2024 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
- ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన, పద్మశాలీల చేనేత కుటుంబాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తున్నదని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి పద్మశాలిని కలిసి చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి లో హైటెక్ సిటీ పద్మశాలి సంఘం అధ్యక్షులు గంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకార, నూతన 2024 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బాపూజీ స్థాపించిన రాజమొహల్లా పద్మశాలి భవన్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గం ప్రతి పద్మశాలిని చైతన్యవంతం చేయాలని కోరారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని తృణ ప్రాయంగా పదవికి రాజీనామా చేసిన బహుజన బిడ్డ బాపూజీ అని తెలిపారు.
- నూతనంగా ఎన్నికైన కార్యవర్గం
అధ్యక్షులు గంజి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు మెరువ సత్యనారాయణ, కోశాధికారి చెన్న రాము, ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేష్, పాలాది ప్రభాకర్, సిలివేరు మహేష్, కుకుడాల ఆంజనేయులు, శ్రీదేవి వైద్య, ముఖ్య సలహాదారులు బొల్లి కృష్ణహరి, పండాల నరసింహులు, సలహాదారులు, చింతకింది విటల్, మోత్కూర్ విజయలక్ష్మి, న్యాయ సలహాదారులు అనిల్ వైద్య, ఆర్థిక సలహాదారులు గంజి సాయికృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి గద్దె శ్రీనివాస్, పులిజాల శివప్రసాద్,ఆడెపు మల్లేష్, గంజి అనురాధ, సాంస్కృతిక నిర్వాహకులు తిరుమల రఘురామ్, ప్రచార కార్యదర్శి, గడ్డం సురేష్, గద్దె జ్యోతి, తాటి విజయలక్ష్మి కార్యదర్శి కరుణాతం మునిందర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నేపల్లి సాంబశివరావు, గోపాల్, ప్రసాద్ పాల్గొన్నారు.