- వేడుకగా శోభాయాత్ర.. జోరుగా లడ్డూ వేలం పాట
నమస్తే శేరిలింగంపల్లి : ఓల్డ్ హఫిజ్ పెట్ గ్రామంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
వినాయక నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరిగాయి. అనంతరం 11వ రోజు శోభాయాత్రలో భాగంగా నిర్వహించిన లడ్డు వేలం పాట కన్నుల పండుగవా జరిగింది.
ఈ వేలం పాటలో గణపతి లడ్డూను రూ. 6 లక్షల 70 వేలకు కనకమామిడి యాదయ్య గౌడ్ తనయులు నరేందర్ గౌడ్, సురేందర్ గౌడ్ కైవసం చేసుకున్నారు. ఆ వినాయకుడు ఆశీస్సులు వారి కుటుంబం పై ఎల్లవేళలా ఉండాలని హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో నిమ్మల అనంతరం గౌడ్, బాలింగ్ లక్ష్మయ్యగౌడ్, యాదగిరి గౌడ్, గౌతమ్ గౌడ్, శ్రీశైలం యాదవ్, బాల్ చారి, ప్రభుగౌడ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బాబు గౌడ్, వెంకటేష్ గౌడ్, బాల్నింగ వెంకటేష్ గౌడ్, జితేందర్ యాదవ, మల్లేష్ గౌడ్, మన్నే వెంకటేష్ ముదిరాజ్, హెచ్ ప్రవీణ్, తలారి పాండు ముదిరాజ్, సాయికుమార్ చేగురి, దేవేందర్, వెంకట రమేష్, సాయి యాదవ్, కుమ్మరి శ్రీశైలం, జగన్ గౌడ్, కుమ్మరి జితేందర్, కుమ్మరి భాస్కర్, ప్రవీణ్ యాదవ్, తలారి విజయ్, దిలీప్, శ్రీకాంత్ ముదిరాజ్, బాలు, హఫిజ్ పేట్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు