నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ 2023 మేళ వేడుకగా ప్రారంభమైంది. ఈ మేళను ప్రిన్సిపాల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం , టూరిజం డిపార్ట్మెంట్ శైలజ రమయ్యిర్ ఐఏఎస్, కిషన్ రావు ఐఏఎస్, స్పెషల్ ఆఫీసర్ శిల్పారామం, దీపక్ శుక్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండెక్స్-సి , డ్ర్. స్నేహాల్ మఖ్వాన మార్కెటింగ్ మేనేజర్ ఇండెక్స్-సి , శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య ప్రారంభించారు.
ఈ మేళాలో గుజరాత్ రాష్ట్రం నుండి విచ్చేసిన 80 చేనేత హస్తకళా ఉత్పత్తుల కళాకారులను పలకరించారు. వారు చేసిన హస్తకళా ఉత్పత్తుల గురించి వివరంగా చూపించారు.
అద్దాల సంచులు, బట్టలు, చీరలు, కాచ్వర్క్ చేసిన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చెక్క తో తయారు చేసిన గృహాలంకారాలు, మడ్ మిర్రర్ వర్క్, పటోళ్ల చీరలు, తంగళియ చీరలు, చున్నీలు, బ్లాక్ ప్రింటింగ్ మెటీరియల్స్ సందర్శకులకు పది రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. రాస్ గర్భ గుజరాతి జానపద నృత్యాలు, జయంతి నారాయణ శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆహుతులను ఎంతగానో అలరించాయి. ప్రతి రోజు సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.