- తెలంగాణ ఆర్యవైశ్య ఐక్యవేదిక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ శ్రీ ఆర్యవైశ్య ఐక్యవేదిక, శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘం సభ్యులు గజ్జల యోగానంద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తాను ఘనంగా సన్మానించారు. అంతేకాక తెలంగాణ ఆర్యవైశ్య ఐక్యవేదిక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.
గౌరవ అధ్యక్షులుగా పచ్చిపులుసు శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షులుగా పసుమర్తి శ్రీనివాసరావు గుప్త, ప్రధాన కార్యదర్శిగా చిన్నం సత్యనారాయణ గుప్తా. కోశాధికారిగా భవిరిశెట్టి కోటేశ్వరావుగుప్త. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గజ్జల యోగానంద, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కల్వ సుజాత, సుధాకర్ గాండె, ఆర్ ఎస్ వి బద్రీనాథ్, పార్శీ ప్రకాష్, మాశెట్టి ప్రభాకర్, గంప సత్యనారాయణ, దారం లక్ష్మణ్, పబ్బ మల్లేష్, మారం వెంకట్, దర్శి శ్రీనివాస్, కుమార్, జనార్ధన్, అశోక్, నరేంద్ర బాబు పాల్గొన్నారు.