- ప్రజలకు నూతన శుభాకంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ అంబేద్కర్ భవన్ లో జనచైతన్య అసోసియేషన్ సమక్షంలో అంబేద్కర్ భవన్ లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా విచ్చేసి బీ ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాలెండరును ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అందరికీ నూతన సంత్సర శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కొత్త సంత్సరం ప్రజలందరికి మేలు జరగాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అంబేద్కర్ భవనాన్ని అన్ని వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రొఫెసర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ చాలా కాలనీలలో కమ్యూనిటీ హాల్లు లేవని, కానీ ఇక్కడ సొంత ఖర్చులతో అంబేద్కర్ భవనం నిర్మించి స్థానిక ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడేలా కృషి చేసినందుకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ లకు కృతజ్ఞులై ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పసునూరి రవీందర్, జనచైతన్య ఎస్సీ&ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి. నర్సింహా, వార్డ్ మెంబర్ శ్రీకళ, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, లీగల్ అడ్వైజర్ తలారి నర్సింహులు, చీఫ్ అడ్వైజర్ ముసలయ్య, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గణపురం రవీందర్, ట్రెజరర్ ఆనంద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తుకారం, మెంటల్ ఆనంద్, సుధాకర్ రెడ్డి, గోపి, కుటుంబ రావు, శామ్ కుమార్, కృష్ణ, జనార్దన్, భాగ్యలక్ష్మి, కుమారి, కళ్యాణి, సుజాత పాల్గొన్నారు.





