ఆగస్టు 3లోపు SIR ఫామ్ సమర్పించండి : యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంప‌ల్లి, జూలై 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్, మక్తా డివిజన్‌ల పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి అర్హ ఓటరు ఆగస్టు 3లోపు ఎన్యుమరేషన్ ఫామ్‌ను తప్పనిసరిగా సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, డీకే ఎన్‌క్లేవ్, సాయిరామ్ నగర్ కాలనీ, జనప్రియ వెస్ట్ సిటీ, జేపీ నగర్, బీకే ఎన్‌క్లేవ్, ప్రజయ షెల్టర్స్ కాలనీ, ప్రగతి ఎన్‌క్లేవ్, వీడియా కాలనీ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని యలమంచి ఉదయ్ కిరణ్ విస్తృతంగా పరిశీలించి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) నిర్వహిస్తున్న నమోదు, ధ్రువీకరణ, వివరాల సవరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. నమోదు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తమ వివరాలు SIR ప్రక్రియలో సక్రమంగా నమోదయ్యాయో లేదో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి అర్హ పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా కుటుంబ సభ్యులు, యువత, స్థానిక ప్రజలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. SIR నమోదు, ధ్రువీకరణకు ఆగస్టు 3 చివరి తేదీ అని గుర్తు చేసిన ఆయన, ప్రతి అర్హ ఓటరు ఆ తేదీలోపు ఎన్యుమరేషన్ ఫామ్‌ను సమర్పించి తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో BLOలు, BLAలు, రత్నాచారి, సతీష్, రామ్, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here