నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపన వారిలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్తర్, కొండల్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్లేష్, శశాంక్, నగేష్ గౌడ్, లింగారెడ్డి, నటరాజు, చిన్నా, పవన్, ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.





