స్టేట్ లెవల్ షూటింగ్ పోటీలకు ఎంపికైన సాన్విత రెడ్డికి ఘన సన్మానం

శేరిలింగంపల్లి, జూలై 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి: ప్రకాశ్ నగర్ కాలనీకి చెందిన రాజారం మనవరాలు సాన్విత రెడ్డి రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపిక కావడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాన్వితను నిమ్మ‌ల ధాత్రీనాథ్ గౌడ్ ఘనంగా సన్మానించి అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి తదుపరి ఉన్నత స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సాన్విత రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె కృషి, క్రమశిక్షణ, పట్టుదల మరిన్ని విజయాలను అందించి ప్రకాశ్ నగర్ కాలనీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్ నగర్ కాలనీ వాసులు పవన్ గౌడ్, రాజారాం, వెంకట్ రెడ్డి, పరమేష్ ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, బెనర్జీ, సుధాకర్, గౌతమ్ తదితరులు పాల్గొని సాన్విత రెడ్డిని అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here